28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మరదే పనిచేయక పోతే

When some application is not responding, you can open task manager and end that task simply. 
కాని మరి task manager యే not responding అని వస్తే ఏంచేయాలి?

ఒక చిన్న సొల్యూషన్:

light a cigarette. . make rings out of smoke.. take cool selfies.. aur thoda time pass kar.. it will respond .

ఐడియా

పొద్దున్నే లేవగానే ఏదైనా ఐడియా వస్తే నా బుర్ర ఏంటి ఇంత పాదరసం లా revolutionary గా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. కాని రాత్రి అయ్యాక దాని గురించి ఆలోచిస్తే లాజిక్ అర్ధం అయ్యి ఇంత bakwaas ఆలోచనలు ఈ ప్రపంచంలో ఏ హౌలా గాడికి రావనిపిస్తుంది.

నా యవ్వారం అట్లా వుంటుంది.

స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లగాడికి కూడా ఈ రోజుల్లో స్వచ్చమైన ప్రేమ దొరుకుతుంది.
నాకు మాత్రం నా బండి keys యే తొందరగా దొరికి చావవు.

వీ(పా)లునామా

ఒక వ్యక్తి చావు బతుకుల్లో డాక్టర్ కిరణ్మయి గారి హాస్పిటల్ లో మంచం మీద వున్నాడు.

ముందు భార్య, పిల్లలు. వెనుక  డాక్టర్ కిరణ్మయి గారు.(ఉషారాం హాస్పిటల్, ఖమ్మం)

పెద్దకోడుకుతో: నాన్న, నువ్వు ద్వారకా నగర్ లోని పది బంగ్లా లు తీసుకో,

కూతురితో: అమ్మా, నువ్వు వరదయ్య నగర్ లో ఎనిమిది అపార్ట్ మెంట్ లు తీసుకో.

చిన్నకోడుకుతో: అప్పా, నువ్వు అందరికన్నా చిన్నవాడివి, నీ మీదే నాకు ఎక్కువ యావ, నువ్వు వైరా రోడ్ లో                               ఇరవై ఆఫీస్ లు తీసుకో.

భార్యతో:  కవితా, నువ్వు మన హయగ్రీవ లోని అన్ని ఫ్లాట్ లు చూసుకో.

కిరణ్మయి గారికి దిమ్మ తిరిగింది. ఆవిడా చాలా ఇంప్రెస్ అయిపోయి
అతని భార్యతో: నువ్వు చాల అదృష్టవంతురాలివి, ఇంత ధనవంతుడు దొరకడం, జాగ్రత్తగా అందరికి పంచడం.

భార్య: ఏంటి పంచేది నా బొంద, రేపటినుంచి ఎక్కడెక్కడ పాలపాకేట్ లు వెయ్యాలో ఆ డూటీ లు పంచుతున్నాడు.




టైటానిక్ మునిగిందా, కాలిందా !!!!!

నిన్న సాయంత్రం కాసేపు మా మయుక వాళ్ళింటికి వెళ్ళాను.
అక్కడ ఒకతన్ని పరిచయం చేసింది " వైజాగ్ లో మాకు తెల్సిన అంకుల్ సార్" అని.

పిచ్చాపాటి మధ్యలో ఆయన వాళ్ళబ్బాయికి సంభందాలు ఏమైనా వుంటే చెప్పమన్నారు.
వాడి ఫోటో చూపించారు.

"ఎలా వున్నాడు?" అయన
"బావున్నాడు" (నిజంగా అయితే బాగా నల్లగా వున్నాడు)

"అదే,  చాలామంది అన్నారు. మీకో విషయం చెప్పనా, ఏదో ఇంగ్లీష్ సినిమా, అదేంటి మయూ అందరు అన్నయ్య ను అలా వున్నవంటారు".

"టైటానిక్ సినిమా లో లాగా" మా పిచ్చి మయుక.
"ఎవరిలాగా!!!" నేను.
"హీరో లియొనార్డ్ డికాప్రియో ;లాగా సార్" తిక్కల్ మేళం.
" ఓహ్, అవునా" టీ మీద పడేది కొద్దిగా అయితే.


మయుక ను దగ్గరికి పిలిచి చిన్నగా అడిగా "చివరలో టైటానిక్ మునిగిపోయిందా, లేకపోతే కాలిపోయిందా!!!!!!!??"



26, ఫిబ్రవరి 2014, బుధవారం

నేనెవరో చెప్పండి.

ప్రొద్దున్నే స్నానం చేసి శివాలయం కు వెళ్ళాం.
అన్ని చోట్లా భారీగా లైన్ లు.
మళ్ళీ మొదటి శివాలయం దగ్గరకే వొచ్చాం.


"హలో సార్, బావున్నారా?" వెనుకనుంచి ఒక గొంతు.
వెనక్కి తిరిగితే ఒక నడివయస్కురాలు.
"బావున్నాం, మీరు బావున్నారా?" (ఎవరా అని ఆలోచిస్తూ)
"ఆ, నన్ను గుర్తుపట్టారా?"   (encounter)
"అయ్యో, భలే వున్నారు"    (Regular dailogue)
"ఎవరో చెప్పండి"    (మటాష్)
"అదే ఎక్కడో చూసా..మీరు.....



మా ఆవిడ: "సారీ అండి, గుర్తుపట్టలేదు అనొచ్చుగా, అంత ఎచ్చులు ఎందుకు మీకు"

హరహర మహాదేవ శంభో శంకర. (ఇట్లా ఎన్ని సార్లు పరిక్షిస్తావు తండ్రి, నా జ్ఞాపకశక్తి అయునా పెంచు, లేదా నా దూల నోటిని అయినా తగ్గించు.) :)

12, అక్టోబర్ 2012, శుక్రవారం

చాలా రోజులయ్యింది బ్లాగ్ వ్రాసి,మాటర్స్
 గుర్తుకొస్తున్నాయి.కాని ఖమ్మం లైఫ్ కూడా హైదరాబాద్ అంత  బిజీ అయిపోతుంది. మొన్నొకసారి  బ్యాంకు కి వెళ్ళాను. లైన్లో నించొని వుంటే కాషియర్ కు తెలిసిన వాళ్ళట. లైన్  అవసరం లేదట.పక్కనుంచి కట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొక అయన లాయర్ అట, పక్కనుంచి ఒక పది చలనాలు ఇచ్చాడు. చిన్న పనులకు కూడా ఈ పద్దతి ఏంటో అర్ధం కావటం లేదు. లైనులో వున్న ముసలివాళ్ళు, పిల్లలు నించోలేక ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మానర్స్ లేకుండా ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం. చివరకు హాస్పిటల్ లో కూడా ఎవరో పోలీసాయన వస్తున్నాడని అందర్నీ ఆపుచేయడం. ఎంతోమంది ఇబ్బంది పడతారని తెల్సి ఇలాచేయడం మంచిది కాదు. అది గొప్పలా చెప్పుకోనేవాళ్ళను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. 
 

20, ఫిబ్రవరి 2012, సోమవారం

పిలుపులు

                                 ఈ మధ్య కాలంలో నేను గ్రహించిన విషయం ఏదైనా ఫంక్షన్ జరుపుకోవాలంటే పిలవాల్సిన వాళ్ళ జాబితా చాలా జాగ్రతగా మెయింటైన్ చేయడం. ఒక ఫంక్షన్ కు మా అక్కయ్య పిలవడం మర్చిపోయిందని మా వదిన వేరే ఫంక్షన్ కు కావాలని పిలవలేదు. ఒక బంధువు ఒక ఫంక్షన్ విషయంలో అందరికి మెసేజ్ పెట్టాడు. తరువాత మెసేజ్ పెట్టినవాల్లలో కొంతమందికి ఫోన్ కూడా చేసాడు. ఇది మిగిలిన వాళ్లకు సస్పెన్స్ గా తయారైంది. అంటే అయన అందరకి క్యాజువల్ గా మెసేజ్ పెట్టి రావాలనుకున్న వాళ్లకు ఫోన్ చేసాడా అని మిగిలిన వాళ్ళ సందేహం. దాంతో కొందరికి కోపం.

                                 ఇంకొక విషయం ఇంతకుముందు ఇంటి పెద్ద ను పిలిస్తే అందరిని పిలిచినట్లు భావించే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పుట్టిన ప్రతి ఒక్కడిని పిలవకపోతే వాడు బెదిరిస్తాడు. ఇక అన్నదమ్ముల్లో ఒకరిని పిలవటం పొరపాటున మరిచిపోయినా అందరూ వాడు ఫీల్ అయ్యాడు కాబట్టి మేమందరం బాయ్కాట్ చేస్తున్నాం అనడం. ఇలా ప్రవర్తించే వాళ్ళలో బాగా చదువుకున్నవాళ్ళు, మంచి ఉద్యోగాలలో వున్నవాళ్ళు వుండటం మరింత ట్విస్ట్.

                             ఇక పెళ్ళికి పోతామా నేను ఐదొందలే పెడతా, నా కూతురు ఫంక్షన్ కి ఆమె అంతే ఇచ్చింది అనటం ఇదొక బాకీలు తీర్చే ప్రహసనం. ఇక మనం చేయని వంటల దగ్గర నుంచి వేరే వాటితో కంపారిజన్. పెట్టుబడుల గోల. కావాలనే నాకీ చీర పెట్టింది. నేనీ కలర్ కట్టుకోనని తెలిసే పెట్టింది. నాకెందుకు తర్వాత దీనిని తనకే పెడతా మొహనకొట్టినట్లు అనడం.

                        ఒక్కోసారి సరదాగా అనిపించినా ఫంక్షన్ చేసుకోవాలంటే భయం అయ్యే రేంజ్ కు పెరిగేటట్లుంటాయి. ఇవన్నీఇగో లతో పాటు అతి ప్రేమలవల్ల కూడా వస్తాయేమో.