6, మార్చి 2014, గురువారం

మరి మగాళ్ళ సీరియళ్ళ సంగతి అదే

పొద్దున్నే ఏ తెలుగు న్యూస్ ఛానల్ చూసిన ఆ రోజు వార్తలపై విశ్లేషణ.

దానికి కొంత మంది నాయకులు కూర్చోటం, ఒకన్ని ఒకడు విమర్సించుకోవడం, చివర్లో ఆ యాంకరింగ్ చేసేవారితో సహా నవ్వుకుంటూ ముగించడం.

ఇక విమర్శలు పరిపాలన, లోపాలు, లాభాలు గురించి కన్నా,

ఆయనకు ముగ్గురు పెళ్ళాలు, ఈయనకు ఇద్దరు, మామను చంపాడు, తండ్రిని చంపాడు, కూతురే లేచిపోయింది, తమ్ముడే వేరే పార్టీ, ముక్కోడు, గ్లామర్ లేదు, తెలుగు మాట్లాడం చేతకాదు,.............

ఇక ఇవే ఎక్కువ!!!!!!!!

దీన్ని ప్రతిరోజు మగాళ్ళందరూ టీవీ లకు అతుక్కుపోయు రాత్రి పూట ఆడవాళ్ళు చూసే సీరియల్స్ కన్నా ఎక్కువ addict అయిపోయి చూడడం. పొద్దున్నే వాకింగ్ లలో ఆఫీస్ లలో, షాప్ ల లో వాటి గురించి ముచ్చట్లు,

ఆడవాళ్లు అనువాదం సేరియల్స్ చూడటం వల్ల ఎంత నష్టమో ఇది అంతకన్నా danger. దానికి sms లు.

ఆయనను విమర్శించే స్థాయి ఈయనకు లేదు అని అనటం ఇంకో ట్విస్ట్. ఆ స్థాయి ఏంటి? indirect మొనార్కిజం.

శ్రీరామ చంద్రుడి అంతటి వాడే ఒక సామన్యుని అనుమానం తీర్చాలని అతని మాటను కూడా గౌరవిస్తే, వీళ్ళకి స్థాయిలట.

జనాలలో 80 శాతం మందికి మెచ్యురిటీ వచ్చింది కాని, నాయకులకు వాళ్ళ చెంచాలకు 20% మందికి కూడా అది లేదు.


చివరగా: ఇచ్చేసిన తెలంగాణా గురించి ఇంకేందుకురా బాబు గోల, సినిమా వాళ్ళు కతలు దొరక్క చస్తున్నట్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి