28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

అవన్నీ ఇప్పుడు కుదరవు.

ఈ రోజుల్లో పెరిగిపోయిన ధరల మీద చర్చ

మా శ్రీధర్ గాడి గోల

కొడుకు ఏది అడిగినా బాగా ఖర్చు పెడుతున్నావని కేకలు.

"నాన్న ఏది అడిగినా ఎందుకు వూరికే అరుస్తావు." వాడు.

" మరేంటి రా, ఆ ఖర్చు పెట్టడం, మా రోజుల్లో అయితే మా శీను గాడు నేను పది రూపాయిలు తీసుకెళ్తే ఉల్లిపాయలు, బియ్యం, పల్లీలు, నూజీల్లు, ఎన్ని తెచ్చేవాళ్ళం. మీరేమో వందలకు వందలు తగల పెడ్తున్నారు."

" ఇప్పుడు అవన్నీ కుదరవు, అన్ని చోట్లా cctv లు పెట్టారు"

మరదే పనిచేయక పోతే

When some application is not responding, you can open task manager and end that task simply. 
కాని మరి task manager యే not responding అని వస్తే ఏంచేయాలి?

ఒక చిన్న సొల్యూషన్:

light a cigarette. . make rings out of smoke.. take cool selfies.. aur thoda time pass kar.. it will respond .

ఐడియా

పొద్దున్నే లేవగానే ఏదైనా ఐడియా వస్తే నా బుర్ర ఏంటి ఇంత పాదరసం లా revolutionary గా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. కాని రాత్రి అయ్యాక దాని గురించి ఆలోచిస్తే లాజిక్ అర్ధం అయ్యి ఇంత bakwaas ఆలోచనలు ఈ ప్రపంచంలో ఏ హౌలా గాడికి రావనిపిస్తుంది.

నా యవ్వారం అట్లా వుంటుంది.

స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లగాడికి కూడా ఈ రోజుల్లో స్వచ్చమైన ప్రేమ దొరుకుతుంది.
నాకు మాత్రం నా బండి keys యే తొందరగా దొరికి చావవు.

వీ(పా)లునామా

ఒక వ్యక్తి చావు బతుకుల్లో డాక్టర్ కిరణ్మయి గారి హాస్పిటల్ లో మంచం మీద వున్నాడు.

ముందు భార్య, పిల్లలు. వెనుక  డాక్టర్ కిరణ్మయి గారు.(ఉషారాం హాస్పిటల్, ఖమ్మం)

పెద్దకోడుకుతో: నాన్న, నువ్వు ద్వారకా నగర్ లోని పది బంగ్లా లు తీసుకో,

కూతురితో: అమ్మా, నువ్వు వరదయ్య నగర్ లో ఎనిమిది అపార్ట్ మెంట్ లు తీసుకో.

చిన్నకోడుకుతో: అప్పా, నువ్వు అందరికన్నా చిన్నవాడివి, నీ మీదే నాకు ఎక్కువ యావ, నువ్వు వైరా రోడ్ లో                               ఇరవై ఆఫీస్ లు తీసుకో.

భార్యతో:  కవితా, నువ్వు మన హయగ్రీవ లోని అన్ని ఫ్లాట్ లు చూసుకో.

కిరణ్మయి గారికి దిమ్మ తిరిగింది. ఆవిడా చాలా ఇంప్రెస్ అయిపోయి
అతని భార్యతో: నువ్వు చాల అదృష్టవంతురాలివి, ఇంత ధనవంతుడు దొరకడం, జాగ్రత్తగా అందరికి పంచడం.

భార్య: ఏంటి పంచేది నా బొంద, రేపటినుంచి ఎక్కడెక్కడ పాలపాకేట్ లు వెయ్యాలో ఆ డూటీ లు పంచుతున్నాడు.




టైటానిక్ మునిగిందా, కాలిందా !!!!!

నిన్న సాయంత్రం కాసేపు మా మయుక వాళ్ళింటికి వెళ్ళాను.
అక్కడ ఒకతన్ని పరిచయం చేసింది " వైజాగ్ లో మాకు తెల్సిన అంకుల్ సార్" అని.

పిచ్చాపాటి మధ్యలో ఆయన వాళ్ళబ్బాయికి సంభందాలు ఏమైనా వుంటే చెప్పమన్నారు.
వాడి ఫోటో చూపించారు.

"ఎలా వున్నాడు?" అయన
"బావున్నాడు" (నిజంగా అయితే బాగా నల్లగా వున్నాడు)

"అదే,  చాలామంది అన్నారు. మీకో విషయం చెప్పనా, ఏదో ఇంగ్లీష్ సినిమా, అదేంటి మయూ అందరు అన్నయ్య ను అలా వున్నవంటారు".

"టైటానిక్ సినిమా లో లాగా" మా పిచ్చి మయుక.
"ఎవరిలాగా!!!" నేను.
"హీరో లియొనార్డ్ డికాప్రియో ;లాగా సార్" తిక్కల్ మేళం.
" ఓహ్, అవునా" టీ మీద పడేది కొద్దిగా అయితే.


మయుక ను దగ్గరికి పిలిచి చిన్నగా అడిగా "చివరలో టైటానిక్ మునిగిపోయిందా, లేకపోతే కాలిపోయిందా!!!!!!!??"



26, ఫిబ్రవరి 2014, బుధవారం

నేనెవరో చెప్పండి.

ప్రొద్దున్నే స్నానం చేసి శివాలయం కు వెళ్ళాం.
అన్ని చోట్లా భారీగా లైన్ లు.
మళ్ళీ మొదటి శివాలయం దగ్గరకే వొచ్చాం.


"హలో సార్, బావున్నారా?" వెనుకనుంచి ఒక గొంతు.
వెనక్కి తిరిగితే ఒక నడివయస్కురాలు.
"బావున్నాం, మీరు బావున్నారా?" (ఎవరా అని ఆలోచిస్తూ)
"ఆ, నన్ను గుర్తుపట్టారా?"   (encounter)
"అయ్యో, భలే వున్నారు"    (Regular dailogue)
"ఎవరో చెప్పండి"    (మటాష్)
"అదే ఎక్కడో చూసా..మీరు.....



మా ఆవిడ: "సారీ అండి, గుర్తుపట్టలేదు అనొచ్చుగా, అంత ఎచ్చులు ఎందుకు మీకు"

హరహర మహాదేవ శంభో శంకర. (ఇట్లా ఎన్ని సార్లు పరిక్షిస్తావు తండ్రి, నా జ్ఞాపకశక్తి అయునా పెంచు, లేదా నా దూల నోటిని అయినా తగ్గించు.) :)