12, అక్టోబర్ 2012, శుక్రవారం

చాలా రోజులయ్యింది బ్లాగ్ వ్రాసి,మాటర్స్
 గుర్తుకొస్తున్నాయి.కాని ఖమ్మం లైఫ్ కూడా హైదరాబాద్ అంత  బిజీ అయిపోతుంది. మొన్నొకసారి  బ్యాంకు కి వెళ్ళాను. లైన్లో నించొని వుంటే కాషియర్ కు తెలిసిన వాళ్ళట. లైన్  అవసరం లేదట.పక్కనుంచి కట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొక అయన లాయర్ అట, పక్కనుంచి ఒక పది చలనాలు ఇచ్చాడు. చిన్న పనులకు కూడా ఈ పద్దతి ఏంటో అర్ధం కావటం లేదు. లైనులో వున్న ముసలివాళ్ళు, పిల్లలు నించోలేక ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మానర్స్ లేకుండా ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం. చివరకు హాస్పిటల్ లో కూడా ఎవరో పోలీసాయన వస్తున్నాడని అందర్నీ ఆపుచేయడం. ఎంతోమంది ఇబ్బంది పడతారని తెల్సి ఇలాచేయడం మంచిది కాదు. అది గొప్పలా చెప్పుకోనేవాళ్ళను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. 
 

20, ఫిబ్రవరి 2012, సోమవారం

పిలుపులు

                                 ఈ మధ్య కాలంలో నేను గ్రహించిన విషయం ఏదైనా ఫంక్షన్ జరుపుకోవాలంటే పిలవాల్సిన వాళ్ళ జాబితా చాలా జాగ్రతగా మెయింటైన్ చేయడం. ఒక ఫంక్షన్ కు మా అక్కయ్య పిలవడం మర్చిపోయిందని మా వదిన వేరే ఫంక్షన్ కు కావాలని పిలవలేదు. ఒక బంధువు ఒక ఫంక్షన్ విషయంలో అందరికి మెసేజ్ పెట్టాడు. తరువాత మెసేజ్ పెట్టినవాల్లలో కొంతమందికి ఫోన్ కూడా చేసాడు. ఇది మిగిలిన వాళ్లకు సస్పెన్స్ గా తయారైంది. అంటే అయన అందరకి క్యాజువల్ గా మెసేజ్ పెట్టి రావాలనుకున్న వాళ్లకు ఫోన్ చేసాడా అని మిగిలిన వాళ్ళ సందేహం. దాంతో కొందరికి కోపం.

                                 ఇంకొక విషయం ఇంతకుముందు ఇంటి పెద్ద ను పిలిస్తే అందరిని పిలిచినట్లు భావించే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పుట్టిన ప్రతి ఒక్కడిని పిలవకపోతే వాడు బెదిరిస్తాడు. ఇక అన్నదమ్ముల్లో ఒకరిని పిలవటం పొరపాటున మరిచిపోయినా అందరూ వాడు ఫీల్ అయ్యాడు కాబట్టి మేమందరం బాయ్కాట్ చేస్తున్నాం అనడం. ఇలా ప్రవర్తించే వాళ్ళలో బాగా చదువుకున్నవాళ్ళు, మంచి ఉద్యోగాలలో వున్నవాళ్ళు వుండటం మరింత ట్విస్ట్.

                             ఇక పెళ్ళికి పోతామా నేను ఐదొందలే పెడతా, నా కూతురు ఫంక్షన్ కి ఆమె అంతే ఇచ్చింది అనటం ఇదొక బాకీలు తీర్చే ప్రహసనం. ఇక మనం చేయని వంటల దగ్గర నుంచి వేరే వాటితో కంపారిజన్. పెట్టుబడుల గోల. కావాలనే నాకీ చీర పెట్టింది. నేనీ కలర్ కట్టుకోనని తెలిసే పెట్టింది. నాకెందుకు తర్వాత దీనిని తనకే పెడతా మొహనకొట్టినట్లు అనడం.

                        ఒక్కోసారి సరదాగా అనిపించినా ఫంక్షన్ చేసుకోవాలంటే భయం అయ్యే రేంజ్ కు పెరిగేటట్లుంటాయి. ఇవన్నీఇగో లతో పాటు అతి ప్రేమలవల్ల కూడా వస్తాయేమో.

3, జనవరి 2012, మంగళవారం

ఇందాక మా సాకేత్ అడిగాడు, జామెట్రీబాక్స్ లో డివైడర్ ఎందుకని? నిజంగే నేనెప్పుడూ ఉపయోగించలేదు. నా చిన్నప్పుడు మా అమ్మే చింతపండు ఇత్తు 
తీయడానికి ఉపయోగించేది!!!!!!!!
డిసెంబర్ 21,22,23 తేదీలలో (వచ్చే సంవత్సరంలేండి) సూర్యుడు మూడు రోజులు కనపడడట!!!. ఫోన్లు, కరెంట్,టీవీలు ఏమి పనిచేయవట!!!!! చిమ్మ చీకటిగా వుంటుందట(వామ్మో)!! మూడు రోజులు పిరమిడ్ ధ్యానం చేసిన వాళ్ళు బతుకుతారట*$#@% భూమికి సూర్యుడికి మధ్యలో ఏదో పెద్ద ఉల్క ప్రయాణిస్తోందట, దాని shadow దాటి పోవడానికి అంత టైం పడుతుంది, దాన్నుంచి వచ్చే కొన్ని rays ఈ వ్యవస్థలన్నీ పనిచేయకుండా చేస్తాయట!!!!!!! రాత్రి మా అపార్ట్మెంట్లో 7th class రోహిత్ గాడు నాకు చెప్పి అదురు పుట్టించి నిద్ర పట్టకుండా చేసాడు:) (వాడింకా భయంకరమైన expressions తో చెప్పాడు). కానీ వాడికి happy నే అట. ఎందుకంటే వాడి birth day December 19. అప్పటికల్లా అయిపోతుందిగా???
అందాన్ని చూస్తున్న అబ్బాయిలు, అంతస్తులు చూస్తున్న అమ్మాయిలు,
ఇది కప్పి పుచ్చడానికి అందమైన ప్రేమ కొటేషన్లు,
మనసులకు కూడా మార్ఫింగ్ చేసుకుంటున్న పిల్లలు,
తల్లడిల్లుతున్న తల్లితండ్రులు.
ఫేస్ బుక్ ను కొంచెం తెలుగులో కూడా వాడండి. మనకు ఎంత ఇంగ్లీష్ వచ్చినా మన భాష మీద కూడా ప్రేమ వుండాలిరా. వెనుకట మా స్నేహితుడు ఒకడు మా అందరి మీద ప్రేమతో వాడి పెళ్లి రెండో తారీఖున రాత్రి అయితే మమ్మల్నందరినీ first night కే రమ్మన్నాడు. వాడిదేమో అభిమానం, ఇంగ్లిషేమో అట్లా తగలబడింది.