చాలా రోజులయ్యింది బ్లాగ్ వ్రాసి,మాటర్స్
గుర్తుకొస్తున్నాయి.కాని ఖమ్మం లైఫ్ కూడా హైదరాబాద్ అంత బిజీ అయిపోతుంది. మొన్నొకసారి బ్యాంకు కి వెళ్ళాను. లైన్లో నించొని వుంటే కాషియర్ కు తెలిసిన వాళ్ళట. లైన్ అవసరం లేదట.పక్కనుంచి కట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొక అయన లాయర్ అట, పక్కనుంచి ఒక పది చలనాలు ఇచ్చాడు. చిన్న పనులకు కూడా ఈ పద్దతి ఏంటో అర్ధం కావటం లేదు. లైనులో వున్న ముసలివాళ్ళు, పిల్లలు నించోలేక ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మానర్స్ లేకుండా ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం. చివరకు హాస్పిటల్ లో కూడా ఎవరో పోలీసాయన వస్తున్నాడని అందర్నీ ఆపుచేయడం. ఎంతోమంది ఇబ్బంది పడతారని తెల్సి ఇలాచేయడం మంచిది కాదు. అది గొప్పలా చెప్పుకోనేవాళ్ళను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు.