26, జులై 2014, శనివారం

పైత్య ప్రకోపం

మా వాడికి చిర్రెత్తింది. జడ్జిగారి దగ్గరకు పోయాడు."నాకు అర్జెంటుగా విడాకులు కావాల్సిందే అండి, నేనిక దానితో వేగలేను. అంతే". 
జడ్జిగారు నచ్చచెప్పారు."అగరా బాబు, ఆర్నెల్లు కలిసివుండండి. అప్పుడు కూడా నీ పైత్యం ఇట్టనే వుంటే చూద్దాం". 
మా వాడు"సమస్యేలేదు, కుదరదు, ఇప్పుడు కావాల్సిందే". 

సర్లే ఇస్తా కాని ముగ్గురు పిల్లలు వున్నారు ఎట్లా పంచుకున్టారోయ్"

మావాడికి లా తెలీదు. వాడి బొంద తెలీదు.

సరే సరే లింక్ అట్లా పెట్టారా, సంవత్సరం ఆగి వస్తా, ఇంటికి పావే, ఆయన తిక్క కుదర్చటానికి నాకు ఓ లెక్క వుంది.(జడ్జిగారి కేదో పంచ్ పడ్డట్టు)

ఒక ఏడాది ఏదో ఏడ్సాడు.

జడ్జిగారు రేపు డెలివరీ డేట్, రాత్రంతా కూసోని గ్రంధాలు తిరగేయండి. ఇప్పటికే నాకు దాంతో కొంచెం ఉండబుద్ది అవుతుంది.అనవసరంగా మళ్ళీ ఆర్నెల్లు అని కబుర్లు చెప్పొద్దు. రేపు ఈవెనింగ్ చెరి ఇద్దర్నీ పంచేయాల్సిందే, నేను మా శ్రీను గాడితో (నేనే) అల్లుడు శ్రీను ఫస్ట్ షో చూడాల్సిందే.

తెల్లారింది. మా వాడు కొత్త బట్టలు వేసాడు. డెలివరి కాగానే ఫోన్ చేస్తానన్నాడు.

సాయంత్రం ఆరైన ఫోన్ చేయట్లే, తీయట్లే, అటు నుంచి జడ్జిగారు ఫోన్, ఆయనకు తీర్పు చెప్పిందాకా ఆగట్లే.

నేనే బయల్దేరా, లకారం చెరువు వైపు ఒక పొట్లం పచ్చి శనక్కాయలు కొనుక్కొని పాయింటు జేబులో పోసుకొని ప్రహరిగోడలకి, కరెంటు స్తంబాలకి కాయలు కొట్టి గింజలు తినుకుంటూ పోతున్నాడు వీడు.

ఏమైందిరా....టికెట్స్ దొరకలేదా....

ఒక వేదాంత పూరిత జ్ఞానామృత ఆధ్యాత్మిక చిరునవ్వు నవ్వి సెన్సార్ వాళ్ళు సూసైడ్ చేసుకునే తిట్లు తిట్టాడు.నాకు భయం వేసింది, కొంపదీసి అమ్మాయికి ఏమన్నా.......

అంతే బ్రెట్ లీ బాల్ కన్నా స్పీడ్ గా హాస్పిటల్ కి వెళ్ళా.

"డాక్టర్ మా చెల్లెలు సక్కుబాయ్ కి ఏమైంది."

అమెకేమయిందోయ్. బ్రహ్మాండంగా కవలలు పుడితేను......

ఆ తర్వాత ఏమయిందోతెలియదు. నేనింకా హాస్పిటల్ నుండి ఇంటికి పోక వారం అయింది. జడ్జిగారు జనరల్ వార్డ్ నుంచి op కి మారారట.

మా వాడు నన్ను చూసి వెళ్ళాడట. అల్లుడు శ్రీను సినిమా బాగానే వుందట. ఇద్దరు కలిసి చూసారట.నర్సు చెప్పింది.